- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ నిర్మాణానికి రేట్ ఫిక్స్
దిశ, కూకట్‌పల్లి : మూసాపేట్ సర్కిల్‌పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం కట్టినా, కట్టాలనుకున్న మినిమమ్ రూ.2లక్షలు రేట్ఫిక్స్చేశారు. మామూలు ఇవ్వాల్సిందే నిర్మాణం పెట్టుకోవాల్సిందే. ఒకవేళ ఇవ్వడంలో ఆలస్యమైనా ఇవ్వకున్నా ఎంతటి వారు అడ్డొచ్చినా సీజ్ చేయడం ఖాయం అన్న రీతిలో ఉంది పరిస్థితి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో మూసాపేట్సర్కిల్అంటేనే ప్రత్యేకం. ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుకోసం అధికారులు చేసే పైరవీలు అన్ని ఇన్ని కావు. గత పదేండ్లు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్న చందంగా తయారైంది మూసాపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం తీరు. సర్కిల్‌కు ఇన్‌చార్జి ఏసీపీ నెలలో రెండు వారాలు విధులకు హాజరువుతుంటారు. మిగిలిన రోజులు ఫలక్‌నుమా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తుంటారు. సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లకు ఒకే ఒక టీపీఎస్ విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే విధులు నిర్వహించిన టీపీఎస్ బదిలీపై పక్క సర్కిల్‌కు వెళ్లి తిరిగి మూసాపేట్ సర్కిల్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి టీపీఎస్ ఎవరికి కనిపించలేదు అన్న చర్చ సర్కిల్ మొత్తంలో హాట్ టాపిక్‌గా కొనసాగుతుంది.
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
మూసాపేట్ సర్కిల్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్, అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్ డివిజన్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కేవలం మామూళ్లే టార్గెట్‌గా పని చేస్తూ మామూళ్లు ఇవ్వని నిర్మాణాలను నిబంధనలను బేఖాతర్పేరుతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి తాము నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్నారు. సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారికి సైతం టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అందుబాటులో లేక పోతుండటంతో ఫిర్యాదు దారులు నేరుగా ప్రజావాణిలో జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అంతే కాకుండా అధికారులపై సైతం ఫిర్యాదుల చేస్తున్నట్లు సమాచారం.
వన్ మెన్ షో
టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీపీ, టీపీఎస్, చైన్‌మెన్, న్యాక్ఇంజనీర్, డిమాలిషన్ టీం సిబ్బంది ఉంటారు. గత కొన్ని రోజులుగా మూసాపేట్సర్కిల్పరిధిలో కేవలం ఏసీపీ, టీపిఎస్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్న చైన్ మెనల్లను కేవలం కార్యాలయానికి పరిమితం చేశారు. అక్రమ నిర్మాణాల వద్ద మామూళ్లు తీసుకుంటున్నారు, టౌన్ ప్లానింగ్ విభాగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వారిపై ఆరోపణలు పెడుతూ నెలకు 40 వేల నుంచి 80 వేల వరకు ప్రభుత్వ ఖజాన నుంచి జీతాలు తీసుకుంటున్న పర్మినెంట్ ఉద్యోగులు కేవలం అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి కార్యాలయం క్యాంటీన్ వద్ద కాలక్షేపం చేస్తున్నారు. చైన్‌మెన్లు లేరు, ఉన్న ఏసీపీ నెలకు రెండు వారాలే విధులకు హాజరు అవుతుండటంతో మూసాపేట్ సర్కిల్ పరిధిలో కేవలం టీపీఎస్ ఆడింది ఆట పాడింది పాటగా మారింది.