- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Heavy rains: తెలంగాణలోని ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని రెండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం లోపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పైన తెలిపిన రెండు జిల్లాలతో పాటు ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే బుధవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాద్రి జిల్లాలో ఉన్న పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మూడు గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తిపెట్టినప్పటికి.. వాగు కట్ట పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పెద్దవాగు ప్రాజేక్టుకు గండి పడే అవకాశం ఉందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.