ఆ మూడు గంటలు అలర్ట్‌గా ఉంటాం: DGP రవిగుప్తా కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఆ మూడు గంటలు అలర్ట్‌గా ఉంటాం: DGP రవిగుప్తా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ రవి గుప్తా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాతబస్తీలో ఎన్నికల సరళిని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ఎన్నికల వేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. పోలింగ్ చివరి మూడు గంటలు అలర్ట్‌గా ఉంటామని తెలిపారు. కాగా, తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం ఇతర చిన్న చిన్న సమస్యలు తప్ప రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది.

Advertisement

Next Story