- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆ విషయం తెలిసి చాలా ఫీల్ అయ్యా’.. కాంగ్రెస్ MLA ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ అధికారులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టుల్లోని అంశాలు స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వందల మంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిందితులు స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. తొలిసారిగా ఈ కేసులో కేసీఆర్ పేరు తెరపైకి రావడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందోనని ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయించిందని తెలిసి చాలా బాధ పడ్డానని అన్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.