Anna Canteen: కడప అన్నా క్యాంటీన్ లో పేలుడు..

by Y.Nagarani |   ( Updated:2024-10-30 05:38:24.0  )
Anna Canteen: కడప అన్నా క్యాంటీన్ లో పేలుడు..
X

దిశ, వెబ్ డెస్క్: అన్నా క్యాంటీన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటన కడపలో చోటుచేసుకుంది. కడప మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వంటగదిలో గ్యాస్ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పేలుడు ధాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వంటలు చేయకపోవడం, సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి వంటగదిలో వస్తువులు చెల్లా చెదురుగా పడిపోయాయి. బాయిలర్ ఎగిరిపడింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed