- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hero Yash: వివాదంలో కన్నడ స్టార్ హీరో యష్.. మంత్రి ఈశ్వర్ ఖండ్రే సంచలన ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త మూవీ ‘టాక్సిక్’ (Toxic) షూటింగ్ కోసం ఇష్టానుసారంగా చెట్లను నరికివేశారంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తాజాగా ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతపై ప్రభుత్వం విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలతో పంచాయితీ మొదలైంది. ఈ మేరకు హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) ప్లాంటేషన్‌లోని లోకేషన్‌ను అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే (Forest Minister Ishwar Khandre) పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని తాను స్వయంగా పరిశీలించానని తెలిపారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నట్లుగా గతేడాది శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. అనుమతి తీసుకోకుండా అటవీ భూమిలో వేలాది చెట్లను నరికివేయడం శిక్షార్హమైన నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని బెంగళూరు కార్పొరేషన్ (Bangalore Corporation)ను ఆదేశించానని తెలిపారు. చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే (Ishwar Khandre) స్పష్టం చేశారు.