Canadia: కావాలనే వాషింగ్టన్ పోస్టుకు దర్యాప్తు విషయాలు లీక్ చేశా

by Shamantha N |
Canadia: కావాలనే వాషింగ్టన్ పోస్టుకు దర్యాప్తు విషయాలు లీక్ చేశా
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ఎన్ఎస్ఏ నటాలియా డ్రౌయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను కావాలనే అమెరికా మీడియా వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేసినట్లు వెల్లడించారు. మంగళవారం పార్లమెంట్‌ ప్యానెల్‌ ముందు ఆమె వాగ్మూలం ఇచ్చారు. నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేయడానికి ట్రూడో అనుమతి అవసరంలేదన్నారు. ఇకపోతే, ఈ విషయంపై కెనడా డిప్యూటీ విదేశాంగమంత్రి డేవిడ్ మోరిసన్ స్పందించారు. భారత్- కెనడా దౌత్య వివాదంలో ఒక అమెరికన్‌ మీడియా కెనడా వాదనను వినిపించేలా చేస్తానని నటాలియా అన్నారని చెప్పారు. తమ కమ్యూనికేషన్‌ వ్యూహం మొత్తాన్ని ట్రూడో ఆఫీస్‌ పర్యవేక్షిస్తోందని చెప్పారు. అక్టోబర్‌ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం గోప్యమైంది ఏమీ కాదని నటాలియా ప్యానల్‌కు వెల్లడించినట్లు తెలిపారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకొన్న చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. ఇక, కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను భారత్ కు ఎలా చూపించామో కూడా తెలిపామన్నారు.

నిజ్జర్ హత్య కేసుపై..

మరోవైపు, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను కెనడా అనుమానితులుగా పేర్కొంది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. కెనడాలోని హైకమిషనర్‌, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. అదే సమయంలో కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే వారు భారత్‌ వదిలిపెట్టారు. మరోవైపు జైళ్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో కెనడాలో భారత్ దాడులు చేస్తోంది ట్రూడో సర్కారు మరో ఆరోపణ చేసింది.

Advertisement

Next Story

Most Viewed