- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan)కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తూ మరోసారి గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని సమాచారం. కాగా.. గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ.2 కోట్లు చెల్లించాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరింపు వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు పంపిన సందేశంలో డబ్బు చెల్లించకపోతే నటుడిని చంపేస్తానని దుండగుడు పేర్కొన్నాడు. థ్రెటెనింగ్ మెసేజెస్ రావడంతో ముంబైలోని వర్లీ జిల్లాలోని పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నోయిడాకు చెందిన వ్యక్తి అరెస్టు
ఇకపోతే, మంగళవారం ముంబై పోలీసులు నోయిడాకు చెంది 20 ఏళ్ల మహ్మద్ తయ్యబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.సల్మాన్ ఖాన్, దివంగత మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ సిద్ధిఖీలను బెదిరించిన కేసులో తయ్యబ్ ని పోలీసులు అర్టు చేశారు. ఇకపోతే, బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటివరకు 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.