Israeli : గాజాలో ఇజ్రాయిల్ బీకర దాడులు

by Y. Venkata Narasimha Reddy |
Israeli : గాజాలో ఇజ్రాయిల్ బీకర దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : గాజా(Gaza), లెబనాన్(Lebanon) పై ఇజ్రాయిల్(Israeli attacks) జరిపిన బీకర దాడుల్లో తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. గాజాలో 143మంది, లెబనాన్ లో 77 మంది మృతి చెందారు. లెబనాన్ లో 33మంది ఇజ్రాయిల్ సైనికులు మరణించారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాలో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం వల్ల 55 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని పాలస్తీనా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది.

గాజా ఉత్తర ప్రాంతంలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న ఐదు అంతస్తుల భవనంపై మంగళవారం ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఈ ఘటనలో 109 మంది మరణించారు. ఉత్తర గాజాలో మంగళవారం నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మరణించారు. ఈ దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (సీఏఐఆర్‌) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది. కాగా శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ మరోసారి సిద్దమని ప్రకటించింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ నిఘా అధిపతి పాల్గొంటున్నారని తాజాగా ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్‌ వర్గాలు సైతం వెల్లడించాయి. ఓ వైపు ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నా దాడులు మాత్రం తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed