- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tallada : ప్రమాదాలకు నిలయంగా తల్లాడ మండల రహదారి..
దిశ, తల్లాడ : అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల పట్టింపు లేని ధోరణితో మండలంలో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో తల్లాడ మండలం వద్ద ఉన్న దుకాణదారులు భయాందోళనలో గురవుతున్నారు. 17 నెంబర్ జాతీయ రహదారి కావడం భారీ వాహనాలు హైదరాబాద్ నుంచి భద్రాచలం, రాజమండ్రి జాతీయ రహదారి పై తల్లాడ మండలం వద్ద డివైడర్ లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే డివైడర్ పై వాహనదారులు రోడ్డు మధ్యలోనే నుంచే ఇష్టం వచ్చినట్టు వాహనాలు తిప్పుతుండడంతో ఇటు గ్రామాల నుంచి వచ్చే వాహనాలతో పాటు ఖమ్మం నుంచి నగరానికి వెళ్లే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. గతంలో డివైడర్ రోడ్డు మరమ్మతుల కోసం అధికారులు రోడ్డు కొంతమేర ఎత్తి పెంచారు. దీంతో ఉన్నటువంటి డివైడర్ వీటిలో కోల్పోయింది. దాని స్థానంలో కొత్తగా ఎత్తు పెంచి మరో బీటీ రోడ్డు నిర్మించడం లేదు దీంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు.
రోడ్డు పైనే వాహనాలు పార్కింగ్..
తల్లాడ మండలం రద్దీగా ఉండే ప్రదేశం హైదరాబాదు నుంచి రాజమండ్రి జాతి రహదారి కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. తల్లాడ మండలం హోటల్ పాటు వాళ్ళ వ్యాపార సముదాయాల ఉన్నాయి. దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు తమ కార్లు బైకులను రోడ్డుకు అనుకునే నిలిపివేస్తాడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వ్యాపార సముదాయాల నిర్వాహకులు వారి షాపులు ఎదుట వాహన పార్కింగ్ స్థలం కేటాయించిక హైవే ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డివైడర్ సరేనా సూచిక బోర్డులో ప్రమాదం హెచ్చరిక బోర్డులో, స్పీడ్ బ్రేకర్స్ అలాగే రేడియం బోర్డులో లేకపోవడం రోడ్డు పైనే వాహనాలు పార్కింగ్ తో ప్రమాదలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రధాన హోటల్లో తల్లాడ మండలంలో ఉండటంతో అక్కడ మొత్తం రద్దీగా ఉంటుంది. అయితే ఈ హోటల్కు వచ్చే ప్రజలు వాహనాలకు పార్కింగ్ లేకపోవడం వల్ల భారీ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది. సెల్లార్ పార్కింగ్ ఉన్న ఎక్కువ మంది వాహనదారులు రోడ్డుపైన వాహనాలను నిలిపివేస్తున్నారు. పోలీస్ అధికారులు యాజమాన్యాల పై చర్యలు తీసుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
తల్లాడ మండలంలో వెంటనే డివైడర్ నిర్మించాలి.. రాత్రి వేళలో డివైడర్ కనిపించడం లేదు.. బోగిని బోయిన వెంకటేశ్వర్లు (పూల వ్యాపారి)..
తల్లాడ మండలం అత్యంత రద్దీ ప్రాంతం ఇక్కడ డివైడర్ రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు జాతి రహదారి పై డివైడర్లు కనిపించడం లేదు కాబట్టి ఏమాత్రం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో డివైడర్ సమస్యతో ప్రమాదాలు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ నెలలోనే ప్రైవేట్ అంబులెన్స్ డివైడర్ కనిపించక దాని పై వాహనాన్ని డివైడర్ ఢీకొట్టగా ఆరుగురికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. గతంలో డివైడర్ సమస్యతో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రయాణికులు తమ వాహనాలను రోడ్డు మధ్యలో నుంచి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నట్టుతో ప్రమాదాలకు కారణం అవుతుంది. అంతే కాకుండా హోటల్కు వచ్చే వాహనాలను పార్కింగ్ సౌకర్యం హోటల్ యాజమాన్యం కల్పించుకోవాలి అధికారులు స్పందించి ఇక్కడ వెంటనే డివైడర్ నిర్వహించి ప్రమాదంలో నివారించాలి.
రోడ్డు మధ్యలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వర్షపు నీరు వల్ల ఏర్పడిన గుంతలు వాహనాలు రోడ్డు కనిపించకపోవడంతో డివైడర్ పై వెళ్తూ తీవ్ర గాయాల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో నిత్యం భారీ వాహనాలను డివైడర్ ల పైకి దూసుకుపోతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. పలు చౌరస్తాలో హెచ్చరిక బోర్డ్లు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళుతున్న సమయాల్లో కొంతమంది యూ టర్న్ తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను డివైడర్ల పై సరైన సూచిక బోర్డులు అలాగే రేడియం స్టిక్కర్ను ఏర్పాటు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.