- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Charan- Upasana: పెళ్లి చూపుల్లో ఉపాసన.. చరణ్‌ని అడిగిన ప్రశ్న ఎంటో తెలుసా..? దానికి చిరంజీవి కూడా షాక్..!
దిశ, సినిమా: స్టార్ కపుల్ రామ్ చరణ్- ఉపాసన(Ram Charan- Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీరికి మ్యారేజ్ అయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత క్లీంకార(Klinkara) అనే పాప కూడా జన్మించింది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రిన్సెస్ ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి ఒక్కరి పెళ్లి చూపుల్లో రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన విషయంలో కూడా ఇలానే జరిగిందట.
ఇక ఇరు కుటుంబాలు మాట్లాడుకున్న తర్వాత పద్ధతి ప్రకారం ఉపసనను మా అమ్మాయి అనిపించుకోవడానికి పెళ్లి చూపులు తరహాలో మెగా కుటుంబం ఉపాసన ఇంటికి వెళ్లిందట. అయితే సరదాగా అక్కడ జరిగిన ఒక సీన్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్లది లవ్ మ్యారేజ్ అయినా పద్ధతి ప్రకారం పెళ్లి చూపుల్లో అబ్బాయి కుటుంబం అమ్మాయిని అడగాల్సిన ప్రశ్నలు చాలా సరదాగా అడిగారట. అయితే ఉపాసన కూడా తిరిగి చరణ్‌ను చాలా స్ట్రైట్‌గా క్వశ్చన్ చేసిందట. "పెళ్లి తర్వాత నువ్వు ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తావు మీ అమ్మగారికా ..? నాకా..?" అంటూ ప్రశ్నించిందట. ఈ ఒక్క ప్రశ్నతో అక్కడే ఉన్న చిరంజీవి షాక్ అయిపోయారట.
అయితే చరణ్ మాత్రం చాలా బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చారట . "తల్లిని ప్రేమించే ప్రతి మగాడు తన భార్యను బాగా చూసుకుంటాడు.. ప్రతి ఒక్కడు తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడు.. అంతే బాగా చూసుకుంటాడు" అంటూ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టి చరణ్ ఆన్సర్‌ని మెచ్చుకున్నారట. ఇలా వీళ్ళ పెళ్లి చూపులు చాలా ఫన్నీగా జరిగాయట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.