- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Dehydration Signs: శరీరంలో డీహైడ్రేషన్ సంకేతాలివే.. గుర్తించకపోతే అంతే సంగతి..?
దిశ, వెబ్‌డెస్క్: రోజులో వాటర్ (water) ఎక్కువగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్యానికి మేలని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. బాడీ యాక్టివ్ (Body active) గా, ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి తగినంత వాటర్ తప్పనిసరి. పనిలో నిమగ్నమై నీరు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ (Body dehydration) సంకేతాల్ని ఇస్తుంది. మరీ ఈ సంకేతాలు అందరిలో ఉంటాయా? లేదు.. ఆరోగ్యాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా డీహైడ్రేషన్ సిమిటమ్స్(Dehydration symmetries) కనిపిస్తాయి. కాగా వాటిని ముందే గుర్తించి పలు జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. నిపుణులు చెప్పిన ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..
డీహైడ్రేషన్ మీ శరీరంలోని ప్రధాన కదలికలను ప్రభావితం చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ(Digestion)ను, మూత్రపిండాల పనితీరు(Kidney function)ను, కండరాల పనితీరు (Muscle function)పై ఎఫెక్ట్ చూపి.. నొప్పులకు దారితీస్తుంది. అంతేకాకుండా కణాలకు అవసరమైన పోషకాల సరఫరా అందక విఫలమై బాడీ మొత్తం అలసిపోతుంది. చర్మం దెబ్బతింటుంది. స్కిన్ పై దురద, ముడతలు, స్కిన్ టోన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. టాయిలెట్ కలర్ (Toilet color) లో మార్పులు కనిపిస్తాయి. యూరిన్ పసుపు లేదా గోధుమ రంగులో వస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత (Electrolyte balance) పాడై.. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇది కాస్త మైగ్రేన్లకు దారితీసే అవకాశం ఉంటుంది. కాగా రోజులో వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో వాటర్ తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.