రిపేర్ చేసిన ‘మేడిగడ్డ’ ఉంటుందనే గ్యారెంటీ లేదు: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-05-20 14:44:24.0  )
రిపేర్ చేసిన ‘మేడిగడ్డ’ ఉంటుందనే గ్యారెంటీ లేదు: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ బ్యారేజీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన మధ్యంతర నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించామని తెలిపారు.

మేడిగడ్డకు మరమ్మత్తులు చేసిన ఉంటుందనే గ్యారెంటీ లేదని కమిటీ చెప్పిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలికంగా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు సాగు నీరు ఇవ్వాలని భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story