- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ, KCR ప్రేమించుకుంటే మాకు నో ప్రాబ్లమ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన CM రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెంది మరికొన్ని రోజుల్లోనే జనం టార్చ్‌లైట్ పట్టుకుని బీఆర్ఎస్ పార్టీని దోలాడుకుంటూ వస్తారన్న గులాబీ బాస్ కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజలు దోలాకుంటూ పోవడం కాదు.. అసలు ఆ పార్టీ ఎక్కడ ఉందని ప్రజలు టార్చ్‌లైట్ వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మాస్ కౌంటర్ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రస్తుతం ఉన్నంతటి దీనావస్థలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ 23 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైమ్ లోక్ సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ గురించి తెలంగాణ ప్రజలు అసలు పట్టించుకోవడం లేదని అన్నారు. గతంలో ఇతర పార్టీల నుండి చేరిన నేతలకు కండువాలు కప్పేటప్పుడు బీజేపీకి ఫిరాయింపులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పట్ల బీజేపీ సానుభూతి దేనికోసమని నిలదీశారు. బీజేపీ, కేసీఆర్ ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం లేదని రేవంత్ తనదైన శైలీలో వ్యాఖ్యానించారు. ఇక, ఎమ్మెల్యేల చేరికల విషయంలో గతంతో పోలిస్తే మేం చాలా ప్రజాస్వామికంగానే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.