బీజేపీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..! రిజైన్ చేస్తేనే ఎంట్రీ అని తేల్చిచెప్పిన మహేశ్వర్ రెడ్డి

by Satheesh |
బీజేపీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..! రిజైన్ చేస్తేనే ఎంట్రీ అని తేల్చిచెప్పిన మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్యేల జంపింగ్ జపాంగ్‌ల పర్వం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు వాళ్ల సొంత పార్టీకి రాజీనామా చేసి వస్తేనే బీజేపీలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు స్పీడ్ పోస్ట్ పంపుతామని చెప్పారు. ఇక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తోన్న యువకుడిని పరామర్శించేందుకు వెళ్తే అక్కడ ఆంక్షలు విధించడమే ప్రజా పాలనా అని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని, త్వరలోనే ఇరిగేషన్ శాఖలోని అవకతవకలను బయట పెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలకు రాజీనామా కండిషన్ పెట్టడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ పక్కా అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ స్పీడ్ పెంచి వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బలాన్ని పెంచుకుంటూ పోతుంటే.. బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలకు కండిషన్లు పెట్టడం గమనార్హం.

Next Story