నీటమునిగిన కజిరంగ పార్కు.. ఖడ్గమృగం సహా 8 వన్యప్రాణులు మృతి

by Shamantha N |
నీటమునిగిన కజిరంగ పార్కు.. ఖడ్గమృగం సహా 8 వన్యప్రాణులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. కజిరంగా నేషనల్ పార్కు నీట మునిగింది. టైగర్ రిజర్వ్ లోని చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. కాగా.. వరద వల్ల ఖడ్గమృగం సహా 8 వన్యప్రాణులు చనిపోయాయి. మరో 44 జంతువులను రక్షించినట్లు అటవీ అధికారులు తెలిపారు. దాదాపు 80 శిబిరాలు నీటి మునిగాయని అధికారులు తెలిపారు. వరద నీరు పెరుగుతుండగా.. పార్కులోని 9 శిబిరాలను ఫారెస్ట్ అధికారులు ఖాళీ చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కజిరంగ పార్కును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జంతువులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వరదల కారణంగా పార్క్ నుంచి తప్పిపోయినట్లు భావిస్తున్న పులి.. బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలోని తోటోయా గ్రామంలోని మజులి ద్వీపానికి చేరుకుందని అసోం మంత్రి రనోజ్ పెగు తెలిపారు.

Next Story