మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే యెన్నం

by Sumithra |
మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే యెన్నం
X

దిశ, హన్వాడ : మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలంలోని 14 గ్రామాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ మొదలు పాఠశాల భవనాల నిర్మాణాలను కూడా అప్పగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకానికి పెళ్లి అయిన నెలలోపే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవద్దు అని ఆయన అన్నారు. ఆడ కూతురు పెళ్లి చేసిన ఏ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హన్వాడ మండల తాహశీల్దార్ కిష్టానాయక్, ఎంపీటీసీ యాదయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, డీసీసీ కార్యదర్శి టంకర కృష్ణయ్య, నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, బి.సుధాకర్ రెడ్డి, నవనీత, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story