అమర్‌నాథ్ యాత్ర తర్వాత కశ్మీర్ పోల్స్ ?

by Hajipasha |
అమర్‌నాథ్ యాత్ర తర్వాత కశ్మీర్ పోల్స్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం కశ్మీర్‌లో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ అమర్‌నాథ్‌ యాత్ర జరుగుతోంది. ఆగస్టు 19న యాత్ర ముగిసిన వెంటనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కశ్మీర్ బీజేపీ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అలర్ట్ చేశారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లోని ఒక్క స్థానంలో కూడా బీజేపీ పోటీ చేయలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌‌లోని మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు కమలదళం రెడీ అవుతోందని సమాచారం. తాజాగా బీజేపీ అధిష్ఠానంతో జరిగిన సమావేశానికి కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా, పార్టీ ఎంపీలు జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ హాజరయ్యారు. కశ్మీర్ అసెంబ్లీ పోల్స్‌లో బీజేపీ ఒంటరి పోరాటమే చేయనుందని అంటున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌తో పాటే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Next Story