17 రోజుల్లో 12 వంతెనలు కూలిన వ్యవహారం.. 16 మంది సస్పెన్షన్

by Hajipasha |
17 రోజుల్లో 12 వంతెనలు కూలిన వ్యవహారం.. 16 మంది సస్పెన్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో : కారణాలు ఏవైనా కావచ్చు.. వంతెనలు అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రంగా బిహార్ అప్రతిష్ఠను మూటకట్టుకుంది. బిహార్‌లో కేవలం 17 రోజుల స్వల్ప వ్యవధిలో ఏకంగా 12 వంతెనలు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన 12 వంతెనల నిర్మాణ, మరమ్మతు పనులను పర్యవేక్షించిన ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయా వంతెనలను నిర్మించిన కాంట్రాక్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. బిహార్‌లో వంతెనలు వరుసగా కూలుతున్నా ప్రధాని మోడీ, సీఎం నితీశ్ కుమార్ మౌనంగా చూస్తున్నారని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ విమర్శించారు. అవినీతి జరిగినందు వల్లే వంతెనల నిర్మాణంలో నాణ్యత లేకుండా పోయిందన్నారు. ఇక మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంఝీ స్పందిస్తూ.. భారీగా కురిసిన వర్షాల వల్లే బిహార్‌లో బ్రిడ్జ్‌లు కూలుతున్నాయని పేర్కొన్నారు.

Next Story