కొత్త మెడికల్ కాలేజీలకు చిక్కులు.. కేంద్రం నుంచి నో పర్మిషన్

by Shiva |
కొత్త మెడికల్ కాలేజీలకు చిక్కులు.. కేంద్రం నుంచి నో పర్మిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ లెటర్ ఆఫ్​పర్మిషన్ (ఎల్ వోపీ) ఇవ్వలేదు. ఆయా కాలేజీల్లో లోపాలు ఉన్నాయని, సోమవారం కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్ కు మెయిల్ పంపించింది. తాము గుర్తించిన లోపాలను వెంటనే సవరించుకోవాలని సూచించింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ , రంగారెడ్డి జిల్లాల్లో కొత్త కాలేజీల కోసం గతేడాది సర్కార్ దరఖాస్తు చేసుకున్నది. ఒక్కోకాలేజీని యాబై ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అయితే సరైన ఫ్యాకల్టీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లేదని వివరిస్తూ ఎన్ ఎంసీ రిమార్క్స్ రాసింది. రెండు నెలల్లో లోపాలను సవరించాలని లేకుంటే పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఇవ్వబోమని ఎన్ ఎంసీ తేల్చిచెప్పింది.

Advertisement

Next Story

Most Viewed