- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి పిఠాపురంలో ఎన్నికలు.. జనసేన జయకేతనం
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగరవేసింది. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో ఐదు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ(Ycp) పోటీ చేయలేదు. టీడీపీ(Tdp), జనసేన(Janasena) వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ ఫలితాల్లో జనసేన మద్దతు ఇచ్చిన ముగ్గురు, టీడీపీ మద్దతు ఇచ్చిన ఒకరు, స్వంతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సొసైటీ ఎన్నికలు జరగడంతో ఉత్కంఠ నెలకొంది.
కాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(Pithapuram Urban Credit Co-operative) పాలకవర్గ ఎన్నికలు(Elections) ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12 మంది పోటీ చేయగా 2011 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోవస్తు నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో ఫలితాలు ప్రకటించారు. జనసేన-3, టీడీపీ-1, స్వంతంత్రులు-1 స్థానంలో గెలిచినట్లు ఖరారు చేశారు.