- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ghatkesar: బిర్యానీలో బ్రేడ్.. ఖంగుతిన్న కస్టమర్
దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి రెస్టారెంట్ లో బిర్యానీ(Biryani) తింటుండగా బ్లేడ్(Blade) వచ్చిన ఘటన ఘట్ కేసర్ (Ghat Kesar)లో జరిగింది. బీబీనగర్ మండలం(Bibinagar Mandal) మక్త అనంతారం గ్రామానికి(Maktha Anantaram village) చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్ బిర్యానీ తినేందుకు ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్(Adarsh Bar and Restaurant) కి వెళ్లారు. వారు బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటుండగా.. ఐలయ్య అనే వ్యక్తికి బిర్యానీలో బ్లేడ్ కంటపడింది. దీంతో కంగారు పడ్డ కస్టమర్ రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించి ఇదేమిటని ప్రశ్నించాడు. దీనికి రెస్టారెంట్ యాజమాన్యం అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతడు రెస్టారెంట్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తినే బిర్యానీ లో బ్లేడ్ వచ్చిందని, చూసుకోకుండా తిని ఉంటే తన పరిస్థితి ఏమై ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదర్శ బార్ అండ్ రెస్టారెంట్ పై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు.