తిరుమ‌ల‌లో గరుడ సేవ.. అధికారుల కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-10-06 17:06:39.0  )
తిరుమ‌ల‌లో గరుడ సేవ.. అధికారుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమ‌ల‌లో గరుడ సేవకు సర్వం సిద్ధమైంది. భ‌క్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం జరగనున్న గరుడ సేవకు 3.5 లక్షల మంది భ‌క్తులు వస్తారని అంచనా వేశారు. గ‌రుడ‌సేవ‌కు వ‌చ్చే భ‌క్తులు ఇన్నర్, ఔటర్ రింగ్‌ క్యూలైన్ ద్వారా మాడవీధుల కూడలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. 1250 మంది టీటీడీ విజిలెన్స్‌తో పాటు 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. గ్యాలరీలో భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేయనున్నారు. మాడవీధుల్లో బయట ఉండే భక్తుల కోసం టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. భక్తుల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టిన అధికారులు మెడికల్ క్యాంపులను తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సోమవారం రాత్రి 9 నుంచి 9వ‌ తేదీ ఉదయం 6 వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు, టాక్సీలకు అనుమతి నిషేధం విధించారు. తిరుమలలో 8 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed