Telangana : ఆరుగురు డీఈవోలకు అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ

by Ramesh N |
Telangana : ఆరుగురు డీఈవోలకు అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పాఠశాల విద్యాశాఖలో అరుగురు జిల్లా విద్యాశాఖాధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్‌ వెంకట నర్సింహా రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఫుడ్ పాయిజన్ వ్యవహారంలో డీఈవో అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వనపర్తి జిల్లా డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇచ్చారు. నాగర్‌కర్నూల్ డీఈవో (ఎఫ్ఏసీ) అధికారి గోవింద రాజులుకు నారాయణపేట, గద్వాల్‌కు ఎఫ్ఏసీ డీఈవోగా పూర్తి అదనపు బాద్యతలు అప్పగించారు.

జగిత్యాల డీఈవో బి. జగన్ మోహన్ రెడ్డిని రాజన్న సిరిసిల్లకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జనగామ డీఈవో రాముని జగిత్యాలకు ఎఫ్ఏసీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల డీఈవో రమేశ్ కుమార్ నాగర్‌ డీఈవో పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జనగామ డీఈవో, అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్‌కు డీఈవోగా జనగామలోనే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed