Stock Market: పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. 24,000 చేరువలో నిఫ్టీ..!

by Maddikunta Saikiran |
Stock Market: పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. 24,000 చేరువలో నిఫ్టీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్(Adani Group) ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gautham Adani)పై లంచం ఆరోపణలపై అమెరికా(USA)లో కేసు నమోదవడంతో గురువారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(శుక్రవారం) అనూహ్యంగా పుంజుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, బ్యాంకింగ్ స్టాక్స్(Banking Stocks)లో కొనుగోళ్ల ఉత్సాహంతో మన బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అలాగే మహారాష్ట్ర(MH), జార్ఖండ్(Jharkhand) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి(NDA Alliance) అధికారం చేప్పట్టే ఛాన్సెస్ ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. దీంతో బాంబే స్టాక్ ఎక్ఛేంజ్(BSE)లో మదుపర్ల సంపద ఏకంగా రూ. 7 లక్షల కోట్లకు పైగా పెరిగి మొత్తంగా రూ. 432 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రోజు ముఖ్యంగా ఇన్ఫోసిస్(Infosys), రిలయన్స్(Reliance), ఐసీఐసీఐ(ICICI) షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 77,349.74 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలై మార్కెట్ ముగిసే వరకు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,218.19 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 1,96.32 పాయింట్ల లాభంతో 79,117.11 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 557.35 పాయింట్లు పెరిగి 23,907 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.42 దగ్గర ముగిసింది.

లాభాలో ముగిసిన షేర్లు : ఇన్ఫోసిస్, టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, టైటాన్, రిలయన్స్

నష్టపోయిన షేర్లు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, నెట్ వర్క్ 18 మీడియా, వొడాఫోన్ ఐడియా

Advertisement

Next Story