- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసు లాంచనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
దిశ, పెద్దేముల్ : గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కు పలువురు నివాళులు అర్పించారు. పోలీసు శాఖ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. పెద్దేముల్ మండల కేంద్రంలోని పోలీస్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కావలి రవికుమార్ (38) శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో నిద్రలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. శనివారం తాండూరు పట్టణంలోని గొల్ల చెరువులో కావలి రవీందర్ అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్సై గిరి, సిబ్బంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు కావలి రవి కుమార్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేసుకుని కుటుంబాన్ని పరామర్శించారు. కానిస్టేబుల్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.