- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
దిశ, వెబ్ డెస్క్ : గల్ఫ్(Gulf) దేశాల్లోని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ(Bathukamma) వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ వాసులు అనేక మంది అరేబియా గల్ఫ్ దేశాల్లో నివస్తున్న సంగతి తెలిసిందే. వారంతా తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి చాటుతూ.. బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అరబ్ దేశాల్లోని ప్రముఖ నగరాల్లో శని, ఆదివారాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి, మహిళలంతా పువ్వుల గౌరమ్మను ఆడిపాడి సాగనంపారు. గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్ లోని నిర్వహించిన బతుకమ్మల ఆటపాటలు బుర్జ్ ఖలీఫాను దాటిపోయాయి. ఇక తెలంగాణ నుండి ప్రత్యేకంగా ఆహ్వానించిన డప్పు కళాకారుల వాయిద్యాలు పండుగకు మరింత ఊపు తెచ్చాయి. అరబ్ దేశాల్లోని తెలంగాణ ప్రవాసులు అందరూ ఒక్కచోట చేరి ఆడిపాడుతూ బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేశారు.