13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థల చైర్మన్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

by M.Rajitha |
13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థల చైర్మన్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకాల కోసం ఎన్నోరోజులుగా నేతలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమకు పదవి దక్కుతుందోనని ఎందరో ఆశించారు. కాగా పలువురిని పదవులు వరించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

నూతన చైర్మన్లు వీరే..

నిర్మల్ - సయ్యద్ అర్జుమంద్ అలీ

సిరిసిల్ల - ఎన్ సత్యనారాయణ గౌడ్

కరీంనగర్ - ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

వనపర్తి - జీ గోవర్ధన్

సంగారెడ్డి - గొల్ల అంజయ్య

కామారెడ్డి - మద్ది చంద్రకాంత్ రెడ్డి

మెదక్ - సుహాసిని రెడ్డి

నారాయణ్ పేట - వీ విజయ్ కుమార్

నాగర్ కర్నూల్ - జీ రాజేందర్

వికారాబాద్ - శేరి రాజేశ్ రెడ్డి

మహబూబ్ నగర్ - మల్లు నరసింహారెడ్డి

జోగులాంబ గద్వాల - నీలి శ్రీనివాసులు

Advertisement

Next Story