భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు!

by Hajipasha |
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు!
X

దిశ, నేషనల్ బ్యూరో : భోలే బాబా పేరుపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో భోలే బాబా ప్రవచన కార్యక్రమం సందర్భంగా ఈనెల 2న జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోవడం పెను విషాదాన్ని మిగిల్చింది.తాజాగా భోలే బాబాకు సంబంధించిన కీలక సమాచారాన్ని జాతీయ మీడియా బట్టబయలు చేసింది. ఆ కథనాల ప్రకారం.. దేశవ్యాప్తంగా భోలే బాబాకు 24 ఆశ్రమాలు ఉన్నాయి. బాబా ఉండేది మాత్రం యూపీలోని మెయిన్‌పురిలో ఉన్న ఆశ్రమంలోనే. దీన్ని హరి నగర్‌ పేరుతో పిలుస్తారు. ఇది 13 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో భోలే బాబా భార్య కోసం ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయి. ఈ ఆశ్రమంలో ఒక శిలా ఫలకం ఉంది. దానిపై ఆశ్రమ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన 200 మంది పేర్లు ఉంటాయి. రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన డొనేషన్స్ వివరాలు అందులో ఉన్నాయి. భోలే బాబా మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు అని ఒక అంచనా. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట భోలే బాబా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. బాబాకు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉన్నారు వీరు బాబా కారుకు ముందు 350సీసీ బైక్స్‌పై ప్రయాణిస్తూ దారిని క్లియర్‌ చేస్తుంటారు. భోలే బాబా కారు వెనక దాదాపు 30 దాకా కార్లతో కాన్వాయ్‌ ముందుకు సాగుతుంటుంది. తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారులో బాబా ప్రయాణిస్తారు. బాబాకు చెందిన కారులో సీట్లు, ఇంటీరియర్‌ కూడా వైట్‌ కలర్‌లోనే ఉంటాయి.

Next Story

Most Viewed