నేడే ‘ఎఫ్‌ఎం‌జీఈ’ అర్హత పరీక్ష.. ప్రశ్నాపత్రంపై కీలక ప్రకటన

by Hajipasha |
నేడే ‘ఎఫ్‌ఎం‌జీఈ’ అర్హత పరీక్ష.. ప్రశ్నాపత్రంపై కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌’ (ఎఫ్ఎంజీఈ).. విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాలి. దీన్ని శనివారం రోజు (ఈనెల 6న ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. నగదు చెల్లిస్తే ఎఫ్ఎంజీఈ ప్రశ్నాపత్రం అందిస్తామంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ) స్పందించింది. అవన్నీ మోసపూరిత ప్రకటనలే అని ఎన్‌బీఈ స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం ఇంకా తయారీ దశలోనే ఉందని వెల్లడించింది. ప్రశ్నాపత్రాలపై ఈ తరహా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయిన ఎన్‌బీఈ తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే కేరళలో ఓ కేసు నమోదైందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed