హత్రాస్ ఘటనపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణమిదే?

by vinod kumar |
హత్రాస్ ఘటనపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మత బోధకుడు బోలే బాబా అధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 123 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ప్రమాదంపై విచారణ చేపట్టిన సిట్ బృందం తాజాగా ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్, చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్‌లు సీఎం యోగీ ఆధిత్యనాధ్ కు శుక్రవారం రిపోర్టును అందజేశారు. 15పేజీల ఈ నివేదికలో 100 మంది వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేశారు. అయితే కార్యక్రమ ఏర్పాటుకు నిర్వహకులు అనుమతి తీసుకున్నప్పటికీ, సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని అందుకే తొక్కిసలాట జరిగి ఉంటుందని సిట్ వెల్లడించినట్టు తెలుస్తోంది. కార్యక్రమ నిర్వాహకులు సభలోని వ్యక్తుల సంఖ్యను అంచనా వేయలేకపోయారని చెప్పినట్టు సమాచారం.

Next Story