- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని మోడీతో భారత జట్టు.. అనంతరం భారీ రోడ్ షో
దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ లో భాగంగా జూన్ 29 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. అయితే గత నాలుగు రోజులుగా బార్బడోస్ లో భారీ తుఫాను అతలకుతలం చేస్తుంది. ఈ క్రమంలో భారత జట్టు నాలుగు రోజుల నుంచి అక్కడే ఉండిపోయింది. అయితే బుధవారం వాతావరణం అనుకూలించడంతో భారత జట్టు విమానం ఇండియాకు బయలుదేరింది. వీరు గురువారం ఉదయం ముంబై చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో టీ20 చాంపీయన్ జట్టు కలుస్తారు. అనంతరం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేస్తున్న భారీ రోడ్ షో లో ప్లేయర్లు పాల్గొంటారు. ఇదిలా ఉంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత భారత్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీంతో రేపు ముంబై నగరంలో జరిగే రోడ్ షోకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.