బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన డిప్యూటీ సీఎం పవన్..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన డిప్యూటీ సీఎం పవన్..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. కూటమి ఘన విజయం సాధించడంతో ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్‌కు వింత ఘటన ఎదురైంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు. ఆ చిన్నారిని చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే కాన్వాయ్ ఆపి మరి ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని పలకరించారు. సిబ్బంది చిన్నారిని నిలువరించేందుకు ప్రయత్నించగా పవన్ వద్దని వారించారు. ఈ వీడియోను జనసైనికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘జై జనసేన’ అంటూ..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story