- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: కౌలు రైతులకు శుభవార్త.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా రైతుబంధు ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో అర్హులైన రైతులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులను కూడా తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రైతు కూలీలకు కూడా రూ.2 వేలు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఫసల్ బీమా కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘోరంగా తయారు చేసిందని అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి బాటలో పయనించిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఆ రూ.7 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. ఆగష్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీని కచ్చితంగా చేస్తామని వెల్లడించారు.