BSP అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌పై RS ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2023-09-04 14:36:49.0  )
BSP అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌పై RS ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన
X

దిశ , తెలంగాణ బ్యూరో: బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 99 శాతం పేదలకు అధికారం దక్కాలనే బీఎస్పీ లక్ష్యంగా త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామన్నారు. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనేది కేవలం బీజేపీ నినాదంగా మిగులుతుంది తప్ప.. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశానికి జమిలి ఎన్నికలు ప్రయోజనకరం కాదన్నారు. జమిలీ ఎన్నికల వల్ల రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయని అన్నారు. బీఅర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ డా.వెంకటేష్ చౌహన్, ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్, అధికార ప్రతినిధులు జక్కని సంజయ్, అరుణ క్వీన్, అభియెందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story