- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘నాకే ఇంకా రైతు బంధు రాలేదు’ మంత్రి తుమ్మల వీడియోపై కేసీఆర్ రియాక్ట్
దిశ, డైనమిక్ బ్యూరో:రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. తనకు ఇంకా రైతు బంధు రాలేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగాతన పక్కనే కూర్చుని ఉన్న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చూపిస్తూ నాకే ఇంకా కొంత రైతు బంధు రాలేదని.. ఈ విషయాన్ని భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాక ఇస్తా అన్నాడని చెప్పారు. ఈ వీడియోను కేసీఆర్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఈ విషయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటనతోనే స్పష్టం అవుతోందని ఆరోపించారు.
కాగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ ప్రతిరోజు ఓ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న, మొన్న విద్యుత్ కోతలపై ఆయన చేసిన పోస్ట్ దుమారంగా మారింది. నీటి కొరత, కరెంట్ కోతల కారణంగా ఓయూలో హాస్టల్స్ బంద్ చేయడంపై కేసీఆర్ చేసిన ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేసీఆర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే ఇవాళ రైతుబంధు సమస్యను కేసీఆర్ ఎంచుకోవడం ఆసక్తిగా మారింది.