పట్టా అందుకున్న కేసీఆర్ మనువడు.. ఆనందంలో కేటీఆర్ ఫ్యామిలీ (వీడియో)

by Mahesh |   ( Updated:2023-06-13 14:50:50.0  )
పట్టా అందుకున్న కేసీఆర్ మనువడు.. ఆనందంలో కేటీఆర్ ఫ్యామిలీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ మనువడు, కేటీఆర్, శైలిమల కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నాడు. గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌‌లో హిమాన్షు 12వ క్లాస్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, కేటిఆర్ దంపతులు, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూల్ గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. అలాగే చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలు అందజేసింది. ఇందులో భాగంగా, సీఎం కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాంశు రావు ‘కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్’ (సిఎఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను వారి ప్రతిభను గుర్తించి, హిమాన్షు‌కు సీఎఎస్ విభాగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ తన మనవడు హిమాన్షును అభినందించారు.


Advertisement

Next Story