కేసీఆర్‌ జిల్లాల పర్యటన ఖరారు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం ఆఫీస్

by Vinod kumar |
కేసీఆర్‌ జిల్లాల పర్యటన ఖరారు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం ఆఫీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభం కాలేదు. అయితే వాటి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వికారాబాద్, మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభించారు. మిగిలిన రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల కలెక్టరేట్‌ల ప్రారంభానికి షెడ్యూల్‌ను ఆదివారం సీఎంఓ కార్యాలయం విడుదల చేసింది.

ఈనెల 25న మధ్యాహ్నం రెండు గంటలకు నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం, సెప్టెంబర్ 5న నిజామాబాద్, 10వ తేదీన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవాలను పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో సభలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభల్లో ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. కేంద్ర వైఫల్యాలను ఎండగట్టనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సవం తీసుకురానున్నారు.

Advertisement

Next Story