- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 రోజులు.. 54 సభలు.. రెండో విడత ప్రచారానికి సిద్ధమైన గులాబీ బాస్..!
దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి నుంచి గులాబీనేత, సీఎం కేసీఆర్ రెండో విడుత ఎన్నికల ప్రచారం షురూ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రచారం స్పీడ్ పెంచనున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. 16 రోజులు 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఆరోజు వరంగల్, గజ్వేల్‌లో సభల్లోనూ కేసీఆర్ పాల్గొననున్నారు. సభలతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచనున్నారు. ఈ నెల 13న అశ్వరావుపేటలోని దమ్మపేట, భధ్రాచలం పినపాక మధ్య బూర్గుంపాడ్, నర్సంపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొంటున్నారు.
14న పాలకుర్తి, నాగార్జునసాగర్(హాలియా), ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజమాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న జనగాంలో రోడ్డుషో, 19న ఆలంపూర్, కల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరువు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి, 28న వరంగల్(ఈస్ట్+వెస్ట్), గజ్వేల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. పార్టీ కేడర్‌ను మరింత సన్నద్ధం చేయనున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు సంధించి శ్రేణుల్లో జోష్ నింపనున్నారు.