- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. 'లైబ్రరీల'ను పట్టించుకోలేదు! మంత్రి పొన్నం
దిశ, వెబ్ డెస్క్: 80 వేల పుస్తకాలు చదివిన అని చెప్పిన కేసీఆర్.. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రంథాలయాల మీద దృష్టి పెట్టలేదని, ఏనాడూ వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని మంత్రి అన్నారు. పద్మశ్రీ డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా సోమవారం అఫ్జల్ గంజల్ లోని కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రంగనాథన్ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇవ్వాలని, సీఎంతో మాట్లాడి.. టీజీపీఎస్సీ ద్వారా ఆ పోస్టులను జాబ్ క్యాలెండర్ లో పెట్టించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రంగనాథన్ స్ఫూర్తితో ప్రతీ మండల కేంద్రాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో.. కేరళలో కంటే ఎక్కువ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని మంత్రి రియాజ్ ను కోరగా, రియాజ్ సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రంథాలయ ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంచాలకులు రాజు, గ్రంథ పాలకులు రాణి, 33 జిలాల్ల పాలకుల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఇంకా విద్యార్థులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.