మోడీ రామ భక్తుడు.. మరి కేసీఆర్ ఎవరి భక్తుడో తెలుసా?

by GSrikanth |
మోడీ రామ భక్తుడు.. మరి కేసీఆర్ ఎవరి భక్తుడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో జోష్ లో ఉన్న బీజేపీ కార్యకర్తలు, హాజరైన జనం మధ్య నుంచి ఒక పోస్టర్ దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వంపై, కేసీఆర్ ఫ్యామిలీపై మోడీ పరోక్షంగా విమర్శలు చేస్తున్న సమయంలో కనిపించిన ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఈ సభకు హాజరైన ఓ వ్యక్తి కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా పోస్టర్ ను ప్రదర్శించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీని రామ భక్తుడిగా వర్ణించగా దాని కింద రోమ్ నగరాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఫోటో జోడించి ‘రోమ్ భక్త’ అని టైటిల్ పెట్టారు. దాని కిందే మద్యం బాటిల్ ఫోటో పెట్టి కేసీఆర్ ఫోటోను జోడించి ‘రమ్ భక్త’ అని రాశారు. ఈ పోస్టర్ మోడీ ప్రసంగిస్తున్నంత సేపు హాట్ టాపిక్ గా మారింది. అయితే దానిపై మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ ఫోటో ఉండటంతో అతనే ఈ పోస్టర్ ను రూపొందించారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story