- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంట్రల్ టీమ్ రిపోర్ట్‌తో ఇరకాటంలో BRS.. ఆ టాపిక్ ఎవరూ మాట్లాడొద్దని గులాబీ లీడర్లకు KCR ఆర్డర్..!
దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడికి వెళ్లినా చాలా గొప్పగా చెప్పుకునేవారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసినందుకు సీఎం కేసీఆర్‌ను అపర భగీరథుడిగా కీర్తించారు. ఆయన వల్లే అనతికాలంలో ప్రాజెక్టు పూర్తయ్యిందని కితాబిచ్చేవారు. సీఎం కేసీఆర్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోయాయని గర్వంగా చెప్పుకునేవారు. ఇదంత గతం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసెత్తడానికి జంకుతున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు బయటికి వచ్చిన తరువాత ఆందోళనలో పడ్డారు.
సంయమనం పాటించండి
కేంద్ర నిపుణుల కమిటీ రిపోర్టు వచ్చిన తరువాతే మేడిగడ్డ బ్యారేజీపై మాట్లాడుతామని వివరణ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. కమిటీ రిపోర్టు పబ్లిక్‌లోకి వచ్చాక కూడా పెదవి విప్పడంలేదు. ఏం మాట్లాడాలో, ఎలా సమర్థించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సైతం ఆందోనళలో పడ్డారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తున్నది. అపోజిషన్ లీడర్లు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సూచించినట్టు సమాచారం.
రిపోర్టును చదివిన కేసీఆర్..?
సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఇచ్చిన రిపోర్టును సీఎం కేసీఆర్ పూర్తిగా చదవినట్టు తెలుస్తున్నది. ఏం రిపోర్టు ఇచ్చారు? ఏఏ అంశాలను ప్రస్తావించారు? ఎక్కడ లోపాలు ఉన్నట్టు గుర్తించారు? అని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు. రిపోర్టు పూర్తిగా సర్కారును టార్గెట్ చేసేవిధంగా ఉందనే అభిప్రాయానికి వచ్చినట్టు బీఆర్ఎస్ సీనియర్ లీడరొకరు పేర్కొన్నారు. కేంద్ర రిపోర్టును స్టడీ చేసి, అభిప్రాయాలు చెప్పాలని, ఆ రిపోర్టును తప్పు పట్టే చాన్స్ ఉందా? అని తనకు సన్నిహితంగా ఉండే ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్‌ను సీఎం కోరినట్టు తెలిసింది.
ప్రచార ఎజెండాలో కాళేశ్వరం అవుట్
ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నది. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పేందుకు కసరత్తు చేసింది. కానీ, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం అంశాన్ని పక్కనపెట్టేసింది. కేసీఆర్ సైతం తన ప్రసంగాల్లో ఎక్కడా కాళేశ్వరం గురించి ప్రస్తావించడంలేదు. ఈ సమయంలో కాళేశ్వరం అంశంపై మాట్లాడితే అబాసు పాలవుతామనే భయంతో మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది.