- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ MLA రాజయ్యకు కేసీఆర్ కీలక పదవి
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య భేటీ అయ్యారు. ఆదివారం ఫాం హౌజ్‌లో సీనియర్ నేతలతో కలిసి సమావేశం అయ్యారు. వరంగల్ జిల్లాతో పాటు స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ నియోజకవర్గం ఇన్ చార్జీ ఖాళీ ఏర్పడింది. ఈ భేటీలో కేసీఆర్‌కు స్టేషన్గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు రాజయ్యకు అప్పగించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు, కేడర్‌ను సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ ఎంపీ అభ్యర్ధి ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలిపించుకోవాలన్నారు. పార్టీ సిట్టింగ్ స్ధానంను నిలుపుకోవాలని అందుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించినట్లు సమాచారం. కష్టపడేవారిని పార్టీ గుర్తింపు నిస్తుందని, గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకోవద్దని సూచించినట్లు తెలిసింది. జిల్లాలో నేతలు పార్టీని వీడినంత మాత్రానా నష్టం ఏమీలేదని, కేడర్ బలంగా ఉందని అందరూ సమిష్టిగా పనిచేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.