దాచేపల్లి మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన సీఎం KCR

by Satheesh |   ( Updated:2023-05-17 09:17:41.0  )
దాచేపల్లి మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన సీఎం KCR
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాకు చెందిన ఆరుగురు కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తూ ఆరుగురు మరణించడం బాధకరమన్నారు. బాధిత కుటుంబాలకు కేసీఆర్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి లక్ష రూపాయల పరిహారం ఎనౌన్స్ చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో మాట్లాడిన కేసీఆర్.. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Also Read..

BRS మళ్లీ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా మద్యం డెలివరీ: బండి సంజయ్

Next Story

Most Viewed