ఈడీ ఆఫీసులో కవితకు ఫేసింగ్ బయోగ్రఫీ వెరిఫికేషన్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 16:07:50.0  )
ఈడీ ఆఫీసులో కవితకు ఫేసింగ్ బయోగ్రఫీ వెరిఫికేషన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ఎదుట కాసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి కవిత నేరుగా ఈడీ ఆఫీసుకు వెళ్లారు. విచారణలో భాగంగా తొలుత కవితకు ఫేసింగ్ బయోగ్రఫీ వెరిఫికేషన్ చేశారు. అంతకుముందు ఈడీ కార్యాలయానికి కవితతో ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమ భరత్ వచ్చారు.

లిక్కర్ స్కాం కేసులో కవిత గత వారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా హాజరుకాలేదు. తాను దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 24న సుప్రీం విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచి చూడాలని కవిత ఈనెల 16న లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ రావాలని ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత విచారణకు హాజరయ్యారు.

Advertisement

Next Story