- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
యువతీయువకులు ఓటు హక్కు కలిగి ఉండాలి
దిశ, రామడుగు : యువతీయువకులు ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదును పురస్కరించుకొని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రామడుగు మండలంలోని వెధిర గ్రామంలో ఓటరు నమోదు జాబితా సమగ్ర పరిశీలనపై సంబంధిత అంగన్వాడీ, బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటు హక్కు కలిగి ఉండాలని, దానికి సంబంధిత బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపట్టి ఓటు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.
గ్రామాల్లో ఇప్పటివరకు మరణించిన వారితో పాటు నూతనంగా ఓటరు నమోదు జాబితాపై ఆరా తీశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి ఇల్లు తప్పకుండా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ కె. మహేశ్వర్, మండల స్పెషల్ ఆఫీసర్ అనిల్ కిరణ్, ఎంపీడీఓ రాజేశ్వరి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎన్యూమరేటర్, అంగన్వాడీ టీచర్ భాగ్యరాణి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.