తలుపు తట్టితే చేతిలో మద్యం సీసా..

by Sumithra |
తలుపు తట్టితే చేతిలో మద్యం సీసా..
X

దిశ, జన్నారం : మండలంలో గ్రామాల్లో బెల్టు షాపులకు అంతు లేకుండా పోయింది. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఏ రాత్రి అయినా సరే తలుపు తడితే మద్యం సీసా చేతిలో పడుతుంది. ఇలా మద్యానికి బానిసలై చాల కుటుంబాలలో గొడవలు జరిగి రోడ్డున పడుతున్నా అదికారులు మాత్రం మాముళ్ళ మత్తులో ఉన్నారు. మరోవైపు వైన్ షాపులకు బెల్ట్ షాపులో ప్రధాన ఆదాయ వనరులుగా మారడంతో వారు సైతం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఒకప్పుడు గ్రామాల్లో ఒకటో రెండో ఉండే బెల్ట్ షాపుల సంఖ్య ఇప్పడు పదుల సంఖ్యలో పెరిగింది. మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది.

చాలామంది పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి విచ్చేస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు వెలువడంతో యువత పెడదారి పడుతున్నారు. బెల్ట్ షాపుల్లో సిట్టింగ్ చేసి మద్యం సేవించడంతో మద్యం మత్తులో మాట మాట పెరిగి గొడవలకు దారి తీస్తున్న. బెల్టు షాపుల మీద చర్యల తీసుకోవాల్సిన అధికారులు మాత్రం గత దసరకు ముందు మండలంలోని పలు గ్రామాలలోని ప్రతి బెల్టు షాపుల వద్ద మాముళ్ళు వసూలు చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అక్రమ బెల్ట్ షాపుల దందా నడుస్తున్న పట్టించుకోవాల్సిన అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story