NEP 2020: మూడేళ్ల డిగ్రీ.. రెండున్నరేళ్లకే కంప్లీట్!

by Mahesh Kanagandla |
NEP 2020: మూడేళ్ల డిగ్రీ.. రెండున్నరేళ్లకే కంప్లీట్!
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడేళ్ల డిగ్రీని వారి సామర్థ్యాలను బట్టి రెండున్నరేళ్లకే పూర్తి చేసుకునేలా.. నాలుగేళ్ల డిగ్రీని(Degree Progamme) మూడేళ్లకు కూడా ముగించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించేలా కసరత్తులు చేస్తున్నట్టు యూజీసీ(UGC) వెల్లడించింది. వచ్చే విద్యాసంవత్సరం(2025-26) నుంచి అమలు చేసే ఆలోచనల్లో ఉన్నట్టు వివరించింది. జాతీయ విద్యా విధానం 2020(National Education Policy 2020) అమలుపై చెన్నైలో ఓ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చిన యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్(M Jagadish Kumar) మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు తెలిపారు. ‘వచ్చే సంవత్సరాల్లో సమర్థులైన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌ను కుదించుకోవచ్చు. ఆరు నెలల నుంచి ఏడాది కాలాన్ని వారు సేవ్ చేసుకోవచ్చని భావిస్తున్నాం’ అని జగదీశ్ కుమార్ వివరించారు. ‘స్లో పేస్‌డ్ డిగ్రీకి కూడా అవకాశముంటుంది. అవసరమైతే విద్యార్థులు తమ డిగ్రీ మధ్యలో బ్రేక్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక నుంచి ఈ కోర్సుల్లో అనేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో త్వరలోనే గైడ్‌లైన్స్ జారీ చేస్తాం’ అని తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడం గురించి మాట్లాడుతూ ‘నాలుగో సంవత్సరంలో విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు. పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశోధక పత్రాలు ప్రచురించవచ్చు. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇది వరకే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి’ అని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed