Boeing: 17,000 మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులిచ్చిన బోయింగ్

by S Gopi |
Boeing: 17,000 మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులిచ్చిన బోయింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపును చేపడుతోంది. అంతర్జాతీయంగా సంస్థలో పనిచేస్తున్న వారిలో 10 శాతానికి సమానమైన 17,000 మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపడం ప్రారంభిస్తున్నట్టు బోయింగ్ ప్రకటించింది. అధిక రుణభారం కారణంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న బోయింగ్ సంస్థ సమస్యల నుంచి బయటపడేందుకు ఉద్యోగాల కోత విధించాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతోందని కంపెనీ వివరించింది. అమెరికాలో ఫెడరల్ నిబంధనలకు అనుగుణంగా 60 రోజుల నోటీస్ పీరియడ్ సమయం వరకు సంస్థలో ఉంటారు. సమ్మె కారణంగా కంపెనీ 5 బిలియన్ డాలర్ల వరకు నష్టాలను చూసింది. అంతేకాకుండా 737 మ్యాక్స్ సహా పలు విమానాల తయారీ ఆగిపోయింది. దీన్ని అధిగమించేందుకు ఉద్యోగులను తొలగించక తప్పట్లేదని బోయింగ్ వివరించింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యకలాపాలపై దృష్టి సారిస్తామని, తొలగించబడిన ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. కాగా, బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్ విమానాల వల్ల సంస్థ ఇబ్బందుల్లో పడింది. వరుస ఘటనల్లో ఇథియోపియా, ఇండోనేషియా దేశాల్లో ఈ విమానాలు ప్రమాదానికి గురవడంతో 346 మంది మరణించారు. ఆ తర్వాత ప్రస్తుత ఏడాదిలోనూ ఓ విమానం డోర్ విరిగిపడిన ఘటనతో బోయింగ్‌పై నిఘా పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed