Delhi: ఢిల్లీలో భారీగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!

by Shiva |   ( Updated:2024-11-14 17:15:12.0  )
Delhi: ఢిల్లీలో భారీగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని కాలుష్యం కమ్మేస్తోంది. అసలే చలికాలం అందులోనూ దట్టమైన పొగమంచు (Fog) కారణంగా జనం అతలాకుతలం అవుతున్నారు. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) నివేదికల ప్రకారం.. 200 కంటే ఎక్కువ పాయింట్లు ఉన్న గాలి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ, తాజాగా ఈ ఏడాదిలో తొలిసారిగా గురువారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా 432కు పెరిగింది.

ఈ క్రమంలోనే అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ (Delhi Government) కాలుష్య వ్యతిరేక చర్యలను అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కొత్త రూల్స్ ప్రవేశ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నంచి ఢిల్లీ (Delhi)లో నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని అక్కడి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలక మినహాయింపు ఇచ్చింది. అదేవిధంగా నగర వ్యాప్తంగా బీఎస్ 3 (BS-3, డీజిల్ వాహనాల (Diesel Vehicles)పై నిషేధం విధించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పాఠశాలల్లో 5వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed